Tuesday, October 15, 2019
Follow Us on :

చంద్రయాన్-2 విఫలమవ్వడంతో అతడి రాక్షసానందం..!

By BhaaratToday | Published On Sep 7th, 2019

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి దశలో విఫలమవ్వడంతో ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోదీ దగ్గరకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. శివన్ ను మోదీ దగ్గరకు తీసుకుని, గాఢంగా హత్తుకున్నారు. తన భుజంపై శివన్ తల ఉంచుకుని, ఆయన వీపును నిమురుతూ, ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఇస్రో సాధించబోయే ఘన విజయాలకు ఇది బలమైన నాంది పలుకుతుందని చెప్పారు. 

ఇస్రోలో మౌనం రాజ్యం ఏలుతున్న సమయంలో పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ మాత్రం భారత్ ను గేలి చేయాలని చూసారు. ఇండియా ఫెయిల్డ్ (“#IndiaFailed”) అనే హ్యాష్ ట్యాగ్ తో పాకిస్థాన్ కు చెందిన నెటిజన్లు భారత్ ను ట్రోల్ చేయాలని చూసారు. దీంతో భారత నెటిజన్లు వారికి సరైనరీతిలో సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకూ అంతరిక్ష రంగంలో పాకిస్థాన్ సాధించిన విషయాలు ఏమిటో చెప్పాలని భారతీయులు పాకిస్థాన్ ను ప్రశ్నించారు.   

పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ తన ట్విట్టర్ ఖాతాలో 'అయ్యో.. పని చేయడం తెలియకుండానే ఎలా సాధించాలని అనుకున్నారో.. డియర్ ఎండియా' అంటూ ట్వీట్లు చేశారు. (Awwwww..... Jo kaam ata nai panga nai leitay na..... Dear “Endia”)

అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద సెటైర్లు వేశారు ఫవాద్.. 'మోదీజీ పొలిటీషియన్ లా కాకుండా ఒక ఆస్ట్రోనాట్ లా ఏదో తెలిసినట్లు మాట్లాడుతూ ఉన్నాడని.. 900 కోట్లు వేస్ట్ చేయించారని లోక్ సభలో అడగాలని' ట్వీట్ చేశారు. అంతే కాకుండా భారత్ ను పూర్ నేషన్(బీద దేశం) అని కూడా కామెంట్లు చేశారు.