Monday, November 18, 2019
Follow Us on :

సిద్ధూకు పాకిస్థాన్ వీసా..!

By BhaaratToday | Published On Nov 7th, 2019

నవంబర్ 9న జరగనున్న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే..! ఇందుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలువురు ప్రముఖులను ఆహ్వానించారు కూడానూ..! ఆ ప్రముఖుల్లో కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు పాకిస్థాన్ వీసా మంజూరు అయినట్లు పాక్ మీడియా తెలిపింది.  పాకిస్థాన్ హై కమిషన్ నవజోత్ సింగ్ సిద్ధూకు వీసాను మంజూరు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం సిద్ధూ వేచి చూస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే పదవిలో ఆయన ఉన్న సిద్ధూ, పాక్ లో అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిని ఆయన తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇక భారత్‌ నుంచి పాకిస్థాన్ లోని కర్తార్‌పూర్‌ గురుద్వారా సందర్శనకు వచ్చే సిక్కు యాత్రికులకు గుర్తింపు ఐడీ ఉంటే చాలని, పాస్‌పోర్ట్ అవసరం లేదని పాకిస్థాన్ అధికారులు  చెప్పారు. 10 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ అవసరం లేదన్నారు. కర్తార్‌పూర్‌ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.