Thursday, July 18, 2019
Follow Us on :

ఆ వీడియోలు బయటకు రావడంతో పాక్ అభిమానులకు ఇంకా కోపమొస్తోంది

By BhaaratToday | Published On Jun 17th, 2019

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎంతో హైటెన్షన్ ఉంటుంది. అది అభిమానులకే కాదు.. ఆటగాళ్లకు కూడా వర్తిస్తుంది. ఇక ఈ వరల్డ్ కప్ లోనూ పాకిస్థాన్ కు భారత్ చుక్కలు చూపించింది. అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్ కంటే భారత్ అద్భుతంగా రాణించింది. కీలక బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరమైనా కూడా భారత్ పాక్ బ్యాట్స్మెన్ కు కుదురుకోడానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇక భారత్ సాధించిన ఈ విజయంపై పాక్ అభిమానులు ఇప్పటికే టీవీలు పగులగొట్టారు. అంతేకాదు భారత జట్టు ముందు పాక్ జట్టు ఏ విధంగానూ సరితూగదని మీడియా సాక్షిగా చెప్పారు అభిమానులు. 

ఇక పోతే భారత్ తో మ్యాచ్ అంటే ఆటగాళ్ల ప్రిపరేషన్లు అలా ఇలా ఉండవు. అయితే పాకిస్థాన్ ఆటగాళ్లు మ్యాచ్ ముందు చేసిన ప్రిపరేషన్ కు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అదేమిటంటే షోయబ్ మాలిక్, వాహబ్ రియాజ్, ఇమామ్ ఉల్ హక్ లు మ్యాచ్ కు ముందు రోజు మాంచెస్టర్ లోని ఓ బార్ లో కూర్చున్నారు. మ్యాచ్ కు ఇంకా కేవలం ఏడు గంటలు మాత్రమే ఉందని.. ఇంకా వాళ్ళు బార్ లో హుక్కా తాగుతున్నారని కొందరు పాకిస్థాన్ అభిమానులు వీడియోలను పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియోలను చూసి పాకిస్థాన్ అభిమానులకు మరింత కోపం వస్తోంది. ఆ ఆటగాళ్లను తిట్టిన తిట్టు రిపీట్ కాకుండా తిడుతున్నారు. 

అయితే ఆ వీడియో జూన్ 14న తీసింది అని పీసీబీ అధికారులు చెబుతున్నారు. పాక్ క్రికెటర్లు నిబంధనలను ఉల్లంఘించలేదని అంటున్నారు పీసీబీ పెద్దలు.