Saturday, October 19, 2019
Follow Us on :

పెట్టుబడిదారుల కోసం పాకిస్థాన్ ఎంత నీచమైన ప్రయత్నాలు చేస్తోందో తెలుసా..?

By BhaaratToday | Published On Sep 9th, 2019

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంత హీనంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశానికి పెట్టుబడులు రాక.. ఖజానాలో డబ్బులు లేక ఎంతగానో ఇబ్బందులు పడుతోంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలిపోయింది. పెట్టుబడుల కోసం పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పలు దేశాలు తిరిగినా కూడా పెద్దగా లాభం లేకుండా పోయింది. 

ఎవరైనా తమ దేశంలో పెట్టుబడులు పెట్టండి అని అడిగే సమయంలో తమ దగ్గర ఉన్న సదుపాయాలు, తాము ఇవ్వగలిగే రాయితీల గురించి చెప్పి ఆకర్షిస్తారు. కానీ పాకిస్థాన్ మాత్రం ఎంతో నీచమైన ప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడుల కోసం బెల్లీ డ్యాన్సర్ల చేత డ్యాన్స్ చేయిస్తోంది. పెట్టుబడిదారులను ఎంటర్టైన్ చేయించి వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ దిగజారుడుతనంపై ఆ దేశ ప్రజలే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే పాకిస్థాన్ కు మద్దతుగా చైనా మాత్రమే నిలిచినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సంక్షేమ ప్రాజెక్టుల్లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ సంతృప్తికరంగా ఉన్న నేపథ్యంలో, మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నామని చైనా రాయబారి యవో జింగ్ తెలిపారు.

Image result for pakistan economy

Image result for pakistan economy

Image result for pakistan economy