Thursday, August 22, 2019
Follow Us on :

అలీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

By BhaaratToday | Published On Apr 8th, 2019

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ నటుడు అలీకి ఉన్న స్నేహం ఇప్పటిది కాదు.. ఎప్పటిదో..! అయితే రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ దారి వేరు.. అలీ దారి వేరు..! ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు అలీకి అండగా ఉన్నానని.. స్నేహమంటే ఇదేనా అని ప్రశ్నించారు. అలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని.. ఎంపీ టికెట్ ఇస్తామంటే వైసీపీలో అలీ చేరాడని చెప్పారు. రాజమండ్రిలో రోడ్ షో లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

గతంలో కూడా పవన్ కళ్యాణ్ అలీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సన్నిహితుడైన అలీ వైసీపీలో చేరిన అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఏ పార్టీలోనైనా చేరే అవకాశం అలీకి ఉందని... వైసీపీ అధినేత జగన్ కు ఎక్కువ బలం ఉందనే నమ్మకంతో అలీ ఆ పార్టీలోకి వెళ్లాడని అన్నారు. అది  అలీ వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. యాక్టర్లు, పాప్యులారిటీ రెండూ వేరువేరని పవన్ అన్నారు. పాప్యులారటీ వల్ల జనాలు చప్పట్లు కొడతారని.. ఆ చప్పట్లను సీరియస్ గా తీసుకోకూడదని చెప్పారు. ఇలాంటి వాటిని తాను నమ్మనని అన్నారు. 

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాక అలీ అందులో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ అందరికీ షాక్ ఇస్తూ జగన్ చెంతకు చేరాడు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణం అని.. కానీ జగన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని అలీ కొద్దిరోజుల క్రితమే చెప్పాడు.