Monday, December 09, 2019
Follow Us on :

రివ్యూ మీటింగ్ లో అభిమానిపై పవన్ ఫైర్

By BhaaratToday | Published On Jun 11th, 2019

పవన్ కల్యాణ్ అభిమానిపై ఫైర్ అయిన‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ఘోరపరాజయానికి గల కారణాలను, తాము చేసిన తప్పుల‌ను పవన్ క్రమంగా బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సమీక్షకు వచ్చిన ఓ అభిమానిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 

పార్టీ సమీక్షా సమావేశానికి వచ్చిన ఓ అభిమాని పార్టీని ఎలా నడపాలన్న విషయమై.. పవన్‌కే సలహా ఇచ్చే ప్రయత్నం చేసినట్లు ఆ వీడియో సారాంశం. ఆ సలహాలను పవన్ విన్నారు. అయితే ‘జనసేనకు ఓటు వేయని నీవు.. పార్టీ ఎలా నడపాలో నాకు సలహా ఇస్తున్నావా?’ ఓడిపోయినా నేను ఇక్క‌డ నిలుచున్నాను.. నీవు నిల‌బ‌డ‌గ‌ల‌వా..? అంటూ అభిమానిపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.