Monday, September 23, 2019
Follow Us on :

పవన్ కల్యాణ్ బర్త్ డే రోజు ఊహించని తప్పు చేసిన పులి హీరోయిన్.. వివరణ..!

By BhaaratToday | Published On Sep 3rd, 2019

పవన్ కల్యాణ్ బర్త్ డే రోజున ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు..! ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఆయన పుట్టినరోజు ట్రెండ్ లో రికార్డు సెట్ చేశారు. పలువురు సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజుకు విషెష్ తెలిపారు. ఆ లిస్టులో పవన్ పులి హీరోయిన్ నికిషా పటేల్ కూడా ఉంది. అలా పవన్ కళ్యాణ్ కు విషెష్ చెప్పే సమయంలో  ‘పావలా కల్యాణ్’ అని హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ చేయడంతో పవన్ అభిమానులు హర్ట్ అయ్యారు. ఆమెను విమర్శించడం మొదలుపెట్టడంతో నికిషా పటేల్ స్పందించింది. 

Image result for nikesha patel

ఆ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. దాన్ని నేను సరిగ్గా చూసుకోకుండానే కొట్టేశాను. పవన్ కల్యాణ్ గారిని బాధపెట్టే ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. ఆయనపై నాకు ప్రేమ, గౌరవం ఉంది. ఇప్పటికైనా మీడియా, పవన్ అభిమానులు శాంతిస్తారనీ, నన్ను ట్రోలింగ్ చేయడం ఆపేస్తారని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. 

ఈ వివాదంపై నికిషా పటేల్ కు పూనమ్ కౌర్ మద్దతుగా నిలిచింది. ‘నికిషా.. నువ్వు ప్రజలకు జవాబుదారీవి కావు. కాబట్టి వివరణలు ఇవ్వడం మానేయ్. లేదంటే నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటారు. గతంలో నువ్వు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నీ వ్యాఖ్యలను వక్రీకరించిన ఆ చెత్త జర్నలిస్ట్ గుర్తున్నాడు కదా. దానివల్ల నీ కెరీర్ పైనే ప్రభావం పడింది. ప్రశాంతంగా ఎంజాయ్ చేయ్. నువ్వు నిజం కోసమే నిలబడతావ్. ఐ లవ్ యూ. నీకు దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది.