
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ ఈరోజు సాగింది. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. జనసేన నేత, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీ ఆర్థిక బడ్జెట్ 2019-20ను చాలా పారదర్శకంగా రూపొందించారని ప్రశంసించారు. నేను జనసేన తరఫున మాట్లాడుతున్నా అధ్యక్షా. అధికార పక్షం ఏదైనా మాట్లాడితే వెంటనే వ్యతిరేకించు అని మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పలేదు అధ్యక్షా. ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు జరుగుతుంటే సపోర్ట్ చేయమని చెప్పారే తప్ప, వాళ్లు అధికార పక్షం కాబట్టి వాళ్లు ఏం చేసినా వ్యతిరేకించమని చెప్పలేదు అధ్యక్షా అని అన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఈ వ్యాఖ్యలు విన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవ్వుతూ కనిపించారు. అలాగే అధికార పక్షం ఏదైనా మాట్లాడితే వెంటనే వ్యతిరేకించు అని మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పలేదు అని అనగానే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బల్లలు చరిచి అభినందించారు.
ఆ పూర్తీ వీడియో చూడండి..