Thursday, April 25, 2019
Follow Us on :

నామినేషన్ వేసిన పవన్

By BhaaratToday | Published On Mar 21st, 2019

విశాఖపట్టణం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. స్థానిక జీవీఎంసీ జోన్ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం తమ పార్టీ నేతలతో కలిసి పవన్ వెళ్లారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ సమర్పించేందుకు ముందు జనసేన పార్టీ శ్రేణులు మర్రిపాలెం నుంచి గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించాయి. వేలాది మంది గాజువాక ప్రజలతో కలిసి నామినేషన్ వేసేందుకు వెళ్లారు పవన్.