Tuesday, October 15, 2019
Follow Us on :

వరుసగా.. ఐదో రోజూ తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు..!

By BhaaratToday | Published On Feb 4th, 2019

వరుసగా ఐదో రోజూ పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గాయి. సోమవారం లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్‌పై  పది పైసలు తగ్గింది. ఢిల్లీలో సోమవారం లీటరు పెట్రోలు ధర రూ. 70.59గా నమోదు కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.65.61గా ఉంది. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా  రూ.76.22,  రూ.68.70గా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోలు ధరలు రూ.75 దిగువకు చేరుకుని రూ.74.89గా నమోదు కాగా, డిజిల్ ధర రూ. 71.33కి తగ్గింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ. 74.69, రూ.70.73గా ఉన్నాయి. ఇక్కడ తగ్గుతున్నా అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి.