Saturday, August 24, 2019
Follow Us on :

కాస్త తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు..!

By BhaaratToday | Published On Jun 13th, 2019

పెట్రోల్-డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. రెండు రోజుల నుంచి స్థిరంగా ఉంటున్న సంగతి తెలిసిందే..! గురువారం నాడు పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 7 పైసలు తగ్గాయి. హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.74.77కు, డీజిల్ ధర రూ.70.11కు చేరుకుంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్‌ ధర 8 పైసలు తగ్గుదలతో రూ.74.55కు, డీజిల్‌ ధర 7 పైసలు తగ్గుదలతో రూ.69.54కు చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 6 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.74.20కు, డీజిల్ ధర రూ.69.22కు చేరింది. 

ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర 8 పైసలు తగ్గుదలతో రూ.70.35కు, డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.64.33కు చేరింది. ముంబయిలో పెట్రోల్ ధర 8 పైసలు తగ్గుదలతో రూ.76.04కు, డీజిల్ ధర 6 పైసలు తగ్గడంతో రూ.67.45 ధర ఉంది.