Saturday, October 19, 2019
Follow Us on :

రూ. 100తో.. నెల రూ.3వేల పెన్షన్..! కేంద్రం తాయిలాలు..!!

By BhaaratToday | Published On Feb 1st, 2019

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో అసంఘటిత రంగ కార్మికులకు కొత్త పింఛన్‌ పథకాన్ని ప్రకటించారు. ప్రధాన మంత్రి శ్రమయోగి మాంధన్‌ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్‌ వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. నెలసరి ఆదాయం రూ.15వేల లోపు ఉండే వారు నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌ అందుతుంది. అసంఘటిత రంగంలోని 10కోట్ల కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 29 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు వచ్చే వరకూ వారు నెలకు రూ.100 కట్టాల్సి ఉంటుంది. 18 ఏళ్లకే చేరితే నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది. కార్మికులు కట్టిన ప్రీమియంకు సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెలా వారి పింఛను ఖాతాలలో జమ చేస్తుంది. ఈ పథకానికి ప్రభుత్వం రూ.500కోట్లు కేటాయించింది. గత ఐదేళ్లలో అన్ని వర్గాల కార్మికుల కనీస ఆదాయం 42శాతం పెరిగిందని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.