Wednesday, October 16, 2019
Follow Us on :

ఉందిలే మంచికాలం ముందు ముందునా..! - మోడీ

By BhaaratToday | Published On Feb 1st, 2019

రైతులు, మధ్యతరగతి వేతన జీవులు సహా అందరి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశాన్ని అభివృద్ధి బాటలో పరుగులెత్తిస్తామన్నారు. పార్లమెంట్‌లో పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం మోడీ మాట్లాడుతూ బడ్జెట్‌లో పలు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపామన్నారు. ప్రభుత్వ పథకాల అమలు నేపథ్యంలో దేశంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా 1.5 కోట్ల మంది శాశ్వత గృహాలు నిర్మించుకున్నారన్నారు. కాగా ఎన్నికల వేళ మధ్యంతర బడ్జెట్‌ ఓటర్లను ఆకట్టుకునేలా సాగింది. పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులు, వేతన జీవులకు ఊరట ఇచ్చే చర్యలు చేపట్టారు. 5 ఎకరాల్లోపు రైతులకు ఏడాదికి రూ 6000 పెట్టుబడి సాయంగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు. ఇక మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు భారీ ఊరటగా ఆదాయపన్నుమినహాయింపు పరిమితిని రూ 5 లక్షలకు పెంచారు. అయిదు లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు.