Tuesday, October 15, 2019
Follow Us on :

ఏపీలో మోడీ ప‌ర్య‌ట‌న ఖ‌రారు..!

By BhaaratToday | Published On Jan 31st, 2019

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల పర్యటనలు ఖరారయ్యాయి. పర్యటనల వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖలో మోడీ పర్యటించనున్నారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 4న విజయనగరంలో బస్సు యాత్రను అమిత్ షా ప్రారంభిస్తారని చెప్పారు. 21న రాజమండ్రిలో క్లస్టర్ మీటింగ్, 25న పార్లమెంట్ నియోజకవర్గ శక్తి కేంద్రాలతో సమావేశం, 26న ఒంగోలులో జరిగే కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారని ఆయ‌న వివ‌రించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై కన్నా వివర్శలు చేశారు. చంద్రబాబు అవినీతిని తట్టుకోలేక కియా మోటార్స్ ఏపీ నుంచి వెళ్లిపోయేదని... మోడీ సూచనతోనే ఏపీకి కియా వచ్చిందని అన్నారు. కేంద్ర పథకాలను చంద్రబాబు తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఎన్ఐఏ, ఈడీలతో పాటు తనకు కూడా చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.