Friday, December 13, 2019
Follow Us on :

దేశాన్ని విడగొట్టాలనే వారి ప్రయత్నాలను ఎంతమాత్రం సాగనీయం!

By BhaaratToday | Published On Apr 14th, 2019

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబ ముఫ్తీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు కుటుంబాలు రాష్ట్రంలోని మూడు తరాలను నాశనం చేశాయని, దేశాన్ని విడగొట్టే వారి ప్రయత్నాలను ఎంతమాత్రం సాగనీయమని అన్నారు. జమ్మూ కావచ్చు, కశ్మీర్ కావచ్చు, లెహ్ లఢక్ కావచ్చు, ఈ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ సైతం భారతదేశ పౌరులేనని అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని కతువాలో బీజేపీ అభ్యర్థి జితేంద్ర సింగ్ తరఫున ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.
 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలంటూ డిమాండ్‌ చేసిన ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీలను గూర్చి ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలోని ఆ రెండు కుటుంబాలకు ఉద్వాసన చెబితేనే కానీ జమ్మూకశ్మీర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండదని ఆయన అన్నారు. వాళ్లు తమ వర్గీయులందర్నీ తెచ్చుకుని మోదీని ఎలా కావాలంటే అలా తిట్టుకోవచ్చని, అయితే దేశాన్ని మాత్రం ఎప్పటికీ విడగొట్టలేరని పేర్కొన్నారు.