Monday, November 18, 2019
Follow Us on :

జాతినుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ..!

By BhaaratToday | Published On Nov 9th, 2019

భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశ ప్రజలందరూ ఆహ్వానించారని మోదీ చెప్పుకొచ్చారు. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఈరోజు భిన్న సంస్కృతుల ప్రజలు ప్రవర్తించిన తీరు.. భారతీయులు 'భిన్నత్వంలో ఏకత్వం' అన్నది పాటిస్తారని మరోసారి నిరూపించారని అన్నారు. ప్రజలు ఈరోజు కోసం ఎంతగానో ఎదురుచూశారని.. చరిత్రలో లిఖించదగ్గ రోజని ఆయన అన్నారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రాత్మకం అని అన్నారు. సుప్రీంకోర్టు ప్రతి ఒక్కరి వాదనలూ విన్నదని.. కానీ సర్వ సమ్మతమైన నిర్ణయాన్ని వెలువరించిందని ఆయన అన్నారు. నెగటివిటీకి స్థానం అన్నది అసలు లేదని.. ఎవరి మనసులో అయినా కించిత్ కఠినత్వం ఉన్నా.. దాన్ని ఈరోజు మీ మనస్సులలో నుండి త్యజించాలని అన్నారు. ప్రజలంతా కలసిమెలసి జీవించడమే నేటి భారత్ అని అన్నారు. సరికొత్త భారత్ కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.