Thursday, November 14, 2019
Follow Us on :

పాకిస్థాన్ గగనతలంపై నుండి ఫ్రాన్స్ వెళ్లిన నరేంద్ర మోదీ

By BhaaratToday | Published On Aug 23rd, 2019

బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత మొదటిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ గగనతలంను ఉపయోగించుకున్నారు. గురువారం నాడు ఫ్రాన్స్ కు వెళ్లే సమయంలో నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను ఉపయోగించారు. 

పుల్వామా ఘటనకు ప్రతీకారంగా ఫిబ్రవరి 26న భారత వాయుసేన బాలాకోట్ లోని తీవ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటూ పాకిస్థాన్ తన ఎయిర్ స్పేస్ లో భారత విమానరాకపోకలను నిషేధించింది. బాలాకోట్ దాడుల అనంతరం పాకిస్థాన్ తన గగనతలంపై వివిధ దేశాలకు ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ అధీనంలో 11 వాయు మార్గాలు ఉండగా కేవలం రెండు రూట్లలో మాత్రమే భారత విమానాలు ప్రయాణించేందుకు పాక్ కొన్ని రోజులు అనుమతించింది. అయితే ఆ తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. జులై నెలలో తమ గగనతలం మీదుగా అన్ని పౌరవిమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసింది.