Monday, September 23, 2019
Follow Us on :

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాక్ ఆర్మీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా..!

By BhaaratToday | Published On Sep 9th, 2019

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్థాన్ ఆర్మీ చేస్తున్న అరాచకాలు అంతా ఇంతాకాదు..! అమాయకులను ఇప్పటికే తీవ్రవాదం వైపు వెళ్లేలా ప్రేరేపిస్తూ ఎన్నో నేరాలు కూడా చేసింది. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు పాకిస్థాన్ ఆర్మీ మీద గుర్రుగా ఉన్నారు. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

పాకిస్థాన్ ఆర్మీ వెనక్కు వెళ్లాలంటూ నినాదాలు చేస్తూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. ప్రజలంతా ఒక చోట ఉండగా.. వారి చుట్టూ పాకిస్థాన్ కు చెందిన భద్రతా బలగాలు ఉన్నాయి. 'కాశ్మీర్ ను వదిలిపెట్టి వెళ్ళండి' అంటూ పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు అక్కడి ప్రజలు. భారత్-పాకిస్థాన్ ల మధ్య కాల్పులు జరిగే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను అడ్డుగా పెట్టుకుంటూ ఉన్నారు. స్థానికులను ఇంటి నుండి బయటకు గెంటేయడం.. హ్యూమన్ షీల్డ్ గా వారిని వాడుకోవడం ఎప్పటి నుండో చేస్తోంది పాకిస్థాన్ ఆర్మీ. అది అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. ఇకపై 'నైట్ రైడ్స్ ఉండకూడదు' అంటూ ఆ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలు పెట్టారు.