Friday, July 19, 2019
Follow Us on :

అత‌నే పూనం కౌర్‌, లక్ష్మీపార్వతిలను వేధించింది!

By BhaaratToday | Published On May 15th, 2019

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, నటి పూనం కౌర్‌లను సోష‌ల్ మీడియాలో వేధించింది ఒకే వ్య‌క్త‌ని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు స‌మాచారం. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలు పోస్ట్‌ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌ వేర్వేరుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీస్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

పూనం కౌర్‌ ఫిర్యాదులో పేర్కొన్న వ్య‌క్తి, లక్ష్మీపార్వతిని వేధించిన వ్య‌క్తి పేరు ఒకటేనని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడితో పాటు మరో వ్యక్తి ఈ నేరంలో భాగస్వామిగా ఉన్నాడని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో వీరు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం సేకరించారు. 

లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్‌పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను ఈ వ్య‌క్తులు పోస్ట్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారా? ల‌ఏదా వ్యక్తిగత కక్షతో చేస్తున్నారా? అనేది వారు పట్టుబడ్డాకే తెలుస్తుందని పోలీసు ఉన్నతాధికారి ఒక‌రు వివరించారు.