Tuesday, May 21, 2019
Follow Us on :

వివేకానంద రెడ్డి హత్య.. పోలీసుల దగ్గర విలువైన క్లూస్..!

By BhaaratToday | Published On Mar 15th, 2019

వివేకానందరెడ్డిని హత్య చేశారని భావిస్తున్నామని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ తెలిపారు. ఆయన శరీరంపై ఏడుచోట్ల గాయాలున్నాయన్నారు. ఈ కేసులో తమకు కొన్ని క్లూస్‌ దొరికాయని, వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేశారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. పదునైన ఆయుధంతో వైఎస్‌ వివేకానందరెడ్డి తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తించారు. నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది.