Monday, November 18, 2019
Follow Us on :

కేజీఎఫ్ విలన్ ను పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ ఫేమ్ పూజ రామ చంద్రన్

By BhaaratToday | Published On Apr 16th, 2019

కేజీఎఫ్ సినిమా దేశాన్ని ఏ రేంజిలో ఊపేసిందో ఆ సినిమాలో హీరో యశ్ కే కాకుండా విలన్లకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఆ విలన్ లలో జాన్ కొక్కెన్ కూడా ఒకరు. ఇక పూజ రామ చంద్రన్ అటు తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్-2 లో పూజ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు వీరిద్దరి గురించి ఎందుకు చెప్తున్నామంటే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని జాన్ కొక్కెన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకున్నారు. మలయాళం యువతి.. తన ప్రేయసి అయిన పూజ రామచంద్రన్ ను విషు పండుగ రోజు కేరళ స్టైల్ లో పెళ్లి చేసుకున్నానని అన్నారు. 

Image result for పూజ రామ చంద్రన్

ఇక పూజ రామచంద్రన్ కూడా సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తేజస్వి మడివాడ, సింగర్ గీతా మాధురి.. పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అతి దగ్గరి వ్యక్తుల మధ్యన వీరిరువురి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.