Monday, November 18, 2019
Follow Us on :

వారందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పూనమ్ కౌర్

By BhaaratToday | Published On Apr 16th, 2019

నటి పూనమ్ కౌర్ పేరు గత కొద్ది రోజులుగా విపరీతంగా వినిపిస్తోంది. ఆమె చేస్తున్న సినిమాల గురించి కంటే పర్సనల్ అంశాల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించారు. ఇక కొన్ని యుట్యూబ్ ఛానల్స్ అయితే ఏవేవో రాశారు. అలాంటి వారిపై పూనమ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సోషియల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులు కి ఫిర్యాదు చేసింది. తనపై యూట్యూబ్‌లో ఉద్దేశపూర్వకంగానే అసభ్యకరమైన పోస్టింగ్ చేస్తున్నారని..  కొంతమంది వ్యక్తులు కావాలనే.. తనను కించ పరిచే విధంగా పోస్టింగులు పెడుతూ, తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ఆమె చెప్పింది. యూట్యూబ్ లింకులు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ  సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది. దాదాపు 50 యుట్యూబ్ ఛానల్స్ పై ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

Related image

కొంతమంది వ్యక్తులు తనను కించపరిచేలా పోస్టింగులు పెడుతూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. యూట్యూబ్ లో లింకులు పెడుతున్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీలోని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.