Tuesday, October 15, 2019
Follow Us on :

భారతీయ జనతాపార్టీ నేతల మరణాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సాధ్వీ

By BhaaratToday | Published On Aug 26th, 2019

ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు పలువురు మరణించడాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. మనోహర్ పారీకర్, సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ ల మరణం ఆ పార్టీకి తీరనిలోటు. వీరి మరణాలపై ఎంపీ, మధ్యప్రదేశ్ బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

బీజేపీ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేతబడి చేయిస్తున్నాయని సాధ్వీ ప్రజ్ఞా సింగ్ సంచలన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తనకు మహరాజ్ జీ అనే ఆధ్మాత్మికవేత్త చెప్పారని సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చెప్పారు. బీజేపీపై ప్రత్యర్థులు క్షుద్రపూజలు చేయిస్తున్నారని మహరాజ్ జీ చెప్పింది నిజమే అనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు బీజేపీకి దుర్దశ నడుస్తోందన్న భావన కలుగుతోందని ఆమె అన్నారు. 

బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఆగష్టు 6న మరణించగా.. అరుణ్ జైట్లీ ఆగష్టు 24న తుదిశ్వాస విడిచారు.