Friday, July 19, 2019
Follow Us on :

భద్రతా సిబ్బందికి వాహనం కేటాయించాల‌ని ప్రహ్లాద్‌ మోదీ నిర‌స‌న‌

By BhaaratToday | Published On May 15th, 2019

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ మంగళవారం ధర్నా చేపట్టారు. త‌న‌ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేప‌ట్టారు. జైపూర్‌-అజ్మేర్‌ జాతీయ రహదారి మార్గంలోని బగ్రు పోలీస్‌ స్టేషన్ వ‌ద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీసుల తెలిపిన వివ‌రాల మేర‌కు.. భద్రతా కారణాల రీత్యా ప్రహ్లాద్‌ మోదీకి ఇద్దరు వ్యక్తిగత భద్రతా అధికారులను కేటాయించారు. నిబంధనల ప్రకారం.. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రహ్లాద్‌తో పాటు ఒకే వాహనంలో వెళ్లాలి. అయితే ఇందుకు ఆయన అంగీకరించలేదు. భద్రతా సిబ్బందిని తన వాహనంలో తీసుకెళ్లనని, వారికి ప్రత్యేక పోలీస్‌ వాహనం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారని పోలీసులు తెలిపారు. అనంత‌రం పోలీసులు సర్దిచెప్పడంతో ప్రహ్లాద్‌ మోదీ భద్రతా సిబ్బందిని వెంట తీసుకుని వెళ్లారు.