Monday, November 18, 2019
Follow Us on :

రామ మందిరంపై ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు..!

By BhaaratToday | Published On Nov 9th, 2019

సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై పలువురు ప్రముఖులు తమ వైఖరిని వెల్లడిస్తూ ఉన్నారు. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో మందిరం నిర్మిస్తారు, మసీదు కూడా కట్టొచ్చు గాక.. కానీ ఇప్పటికే ఎంతో రక్తపాతం జరిగింది. మనిషి ప్రాణం ఎంతో విలువైంది. తదనంతరం జరగబోయే హింసను, రెచ్చగొట్టే ధోరణులను మనం ఆపలేమా! మనిషి ప్రాణాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టలేమా.. దయచేసి ఆలోచించండి.. అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. 

లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా దీనిపై స్పందించారు. హిందువులు కానీ, ముస్లింలు కానీ అన్ని వర్గాల ప్రజలు అయోధ్య వివాదంలో అనవసర రాద్ధాంతానికి ముగింపు కోరుకున్నారు. ఒక స్థానిక భూవివాదం జాతీయ సమస్యగా మారిందంటే అందుకు కారణం పక్షపాత రాజకీయాలు, కొన్ని గ్రూపుల అస్థిత్వ పోరాటం.. ఇక ఈ అధ్యాయాన్ని ముగిద్దామన్నారు. మన యువత భవిష్యత్ పై దృష్టి సారిద్దాం అంటూ ట్వీట్ చేశారు.