Saturday, August 24, 2019
Follow Us on :

ప్రణయ్ హత్య కేసులో 1600 పేజీల ఛార్జిషీట్‌

By BhaaratToday | Published On Jun 12th, 2019

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో పోలీసులు బుధవారం ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును తొమ్మిది నెలల పాటు సమగ్ర విచారణ జరిపిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్‌ పరీక్షల నివేదికతో కూడిన సుమారు 1600 పేజీల ఛార్జిషీట్‌ను మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నల్గొండ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో సమర్పించారు.

తన కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో తట్టుకోలేని మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయి శ్రవణ్‌, ఎంఏ కరీం, అస్గర్‌అలీ, అబ్దుల్‌ బారీ, సుభాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బెయిల్‌పై మారుతీరావు, శ్రవణ్‌, కరీం విడుదలయ్యారు. ఇక ఈ ముగ్గురితోపాటు మరో ఐదుగురి పేర్లను కూడా పోలీసులు చార్జిషీటులో చేర్చారు. హత్యజరిగిన 9 నెలల అనంతరం చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం.