Thursday, September 19, 2019
Follow Us on :

ప్రియాంక అరెస్ట్.. తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ రాహుల్

By BhaaratToday | Published On Jul 19th, 2019

యూపీలోని సోంభద్రలో కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రాను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె అరెస్ట్‌పై సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అక్రమ అరెస్ట్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ రైతులను కలిసేందుకు వెళ్లిన ప్రియాంకను అక్క‌డి అధికారుల‌ అండతో అరెస్ట్ చేశారని రాహుల్ అన్నారు. ట్విట్టర్ ద్వారా ప్రియాంక అరెస్ట్‌ను రాహుల్ ఖండించారు.
 
ఆదివాసీ రైతులను పరామర్శించడానికి వెళ్లిన ఆమెను అధికారం అండతో ఏకపక్షంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక అరెస్ట్ పూర్తిగా అక్రమంగా జరిగింది.  తమ సొంత భూమి కోసం పోరాడుతున్న రైతులను తుపాకులతో కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్‌లో భద్రతను ప్ర‌భుత్వం  గాలికొదిలేసింద‌ని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ సహా కొంతమంది కాంగ్రెస్ నేతలు స్థానిక పోలీసులతో మాట్లాడుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ఇదిలావుంటే.. సోంభద్ర సమీపంలోని ఓ గ్రామంలో 22 ఎకరాల భూవివాదంలో ఇరు గ్రూపులు ఒకరినొకరు కాల్చుకున్నారు. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డరు. ఈ విష‌యమై బాధిత రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఆమె వెళ్లారు.