Tuesday, September 24, 2019
Follow Us on :

అహంకారమా.. ప్రియాంక గాంధీ తప్పు చేసినట్లేనా..!

By BhaaratToday | Published On Mar 21st, 2019

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వివాదంలో చిక్కుకున్నారు. వారణాసికి ప్రచారానికి వచ్చిన ఆమెను పలువురు పూల మాలలతో నేతలు సత్కరించారు. అయితే ఆ తర్వాత తన మెడలోని ఓ పూలదండను తీసి.. అక్కడే ఉన్న దివంగత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి విగ్రహం మెడలో వేశారు. ప్రియాంక తన మెడలోని హారాన్ని లాల్‌ బహదూర్‌ శాస్త్రి విగ్రహానికి వేయడం చాలా తప్పని.. ఆయన్ను అవమానించినట్లేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి. 

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ..దీనిపై తీవ్రంగా స్పందించారు. ఒకరు వినియోగించిన పూలహారాన్ని శాస్త్రి విగ్రహానికి వేసి.. ప్రియాంక ఆయనను అవమానించారని, ఆమె అహంకారానికి ఇది నిదర్శనమని అన్నారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ దానికి సంబంధించిన వీడియోను స్మృతి తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీంతో పాటు ఓ హిందీ కవితను ట్వీట్ చేశారు. శాస్త్రీకి నివాళులు అర్పించిన తర్వాత అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఆయన విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. శాస్త్రీని కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలేదని విమర్శించారు. 

గంగాయాత్ర ముగింపు సందర్భంగా వారణాసి రామ్‌నగర్‌లోని శాస్త్రీ గృహాన్ని సందర్శించి ఆయన విగ్రహానికి ప్రియాంక నివాళులర్పించారు. అయితే ఈ ఘటనలో ఆమె కార్యకర్తలు తనపై వేసిన పూలమాలను తీసి శాస్త్రి విగ్రహానికి వేశారు.