Sunday, December 15, 2019
Follow Us on :

22 ఏళ్ల నాటి ఫోటోను షేర్ చేసిన ప్రియాంక.. విష‌య‌మేమిటంటే..

By BhaaratToday | Published On Jul 17th, 2019

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ త‌న‌య‌ ప్రియాంక గాంధీ తన పెళ్లి నాటి ఫోటోను ట్విట‌ర్‌లో షేర్‌ చేశారు. చీర కట్టులో ఉన్న ఫోటోను షేర్‌ చేసిన ప్రియాంక గాంధీ.. 22 ఏళ్ల క్రితం.. నా పెళ్లి రోజు నాడు ఉదయం పూజా సమయంలోని ఫోటో అని ఆమె పేర్కొన్నారు. సారీ ట్విట‌ర్ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఆమె పోస్టుకు ట్యాగ్‌ చేశారు. ప్రియాంక తన పెళ్లి నాటి ఫోటోను షేర్‌ చేసిన కొన్ని క్షణాల్లోనే అది వైరల్‌ అయింది. ఈ ఫోటోకు 1.6 లక్షల మంది రీట్వీట్‌ చేయగా, 14 లక్షల మంది లైక్‌ చేశారు. ప్రియాంక గాంధీ 1997, ఫిబ్రవరి 18న ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ట్విట్టర్‌లో సారీ ట్విట‌ర్ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖులు, మహిళా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చీరల్లో ఉన్న ఫోటోల్ని షేర్ చేస్తున్నారు.