Saturday, August 24, 2019
Follow Us on :

వారిని టెన్షన్ పెడుతున్న ఆయన సర్వే

By BhaaratToday | Published On May 20th, 2019

2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో కరెక్ట్ గా చెప్పిన వారిలో లగడపాటితో పాటూ.. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఉన్నారు. అయితే ఈసారి లగడపాటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ చంద్రబాబుకే పట్టం కడతారని చెప్పుకొచ్చారు.. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం పూర్తీ భిన్నంగా చెప్పుకు రావడం తెలుగుదేశం నేతలను టెన్షన్ పెడుతోంది.   

ఫ్రొఫెసర్ నాగేశ్వర్ సర్వే ఫలితాలు:  

తెలంగాణ ఎన్నికల ఫలితాలప్పుడు లగడపాటి సర్వేకి పూర్తి భిన్నంగా నేను చెప్పాను అదే నిజమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి అంత అనుకూలంగా లేదని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఏపీలో అనుభవానికి ఓటేశారని, అయితే ఈసారి జగన్ కే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు.

మొత్తం 175 సీట్లను చూస్తే.. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కూడా కంఫర్టబుల్‌గా ఈ సీట్లలో వైసీపీ గెలుస్తుంది అని అన్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇవే సీట్లు గెలుస్తుందని కానీ .. నెంబర్ చెబుతున్నా. సిట్టింగ్ సీట్లు అన్నీ ఎప్పుడూ ఏ పార్టీ గెలవదు. ఓ పది సీట్లు అటూ ఇటూగా గెలవచ్చు.. ఓడొచ్చు అని చెప్పారు.  

వైసీపీకి 98 నుంచి 102 సీట్ల వరకు రావొచ్చని ఆయన అంచనా వేశారు. టీడీపీ ఈ స్థాయిలో సీట్లు గెలిచేందుకు ఉన్న అవకాశాలు చాలా తక్కువని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. జనసేనకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీకి 15 సీట్ల వరకు రావొచ్చని చెప్పారు. వాస్తవానికి జనాల్లో చంద్రబాబుపై వ్యతిరేకత లేకపోయినా, జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలన్న తాపత్రయమే ఓటింగ్ సరళిపై ప్రభావం చూపిందని నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఇంకో రెండు రోజులు ఎదురుచూస్తే ఎవరి అంచనాలు నిజమయ్యాయో తెలిసిపోతుంది.