Saturday, October 19, 2019
Follow Us on :

పబ్ జి గేమ్ కు బానిస అయితే.. మరీ ఇలాంటి పనులు చేసుకుంటారా..?

By BhaaratToday | Published On Feb 4th, 2019

పబ్ జి.. ఈ ఆన్ లైన్ గేమ్ వలన పిల్లల్లో హింసాత్మక ప్రవ్రుత్తి పెరిగిపోతోంది. ఈ గేమ్ ఆడుతూ ఆడుతూ చాలామంది తమ పనులు కూడా చేయడం లేదు. ఎప్పుడు చూసినా ఈ ఆన్ లైన్ గేమ్ పడి పక్కన ఏమి జరుగుతోందో కూడా పట్టించుకోవడం లేదు. ఇష్టమొచ్చినట్లు అరుస్తూ ఉండడం.. ఆడకపోవడంతో ఏమైనా అయిపోతుందేమోనని భయపడిపోవడం ఈ గేమ్ కు బానిసలుగా మారిన యువతలో వస్తున్న పరిణామాలు. ఇటీవలే ఈ గేమ్ గురించి మోడీ కూడా మాట్లాడారు. 

అయితే ఈ గేమ్ ఆడాలి అంటే ఫోన్ లో కొంచెం స్పెసిఫికేషన్స్ బాగుండాలి. ర్యామ్ కాస్త ఎక్కువగా ఉంటే గేమ్ ను సాఫీగా ఆడొచ్చు. ఈ గేమ్ ఆడాలి అనుకున్న వాళ్ళు మంచి ఫోన్ లనే కొనాల్సి ఉంటుంది. ముంబైకి చెందిన 18 ఏళ్ల యువకుడు కూడా పబ్ జి గేమ్ బాగా ఆడగలిగే ఫీచర్లు ఉన్న ఫోన్ కొందామని అనుకున్నాడు. అయితే అతడి తండ్రి 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. కానీ తనకు 37,000 రూపాయలు విలువ చేసే హై-ఎండ్ ఫోన్ మాత్రమే కావాలని పట్టుబట్టాడు. అతడి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతోనే పబ్ జి గేమ్ ఆడగలిగే ఫోన్లు కొనొచ్చు.. కానీ అతడు మాత్రం 37,000 రూపాయలు విలువ చేసే హై-ఎండ్ ఫోన్ కావాలని మొండి పట్టుదలతో ఉన్నాడు. అయితే అతడి తల్లిదండ్రులు దానికి నిరాకరించారు.. దీంతో అతడు వంటగదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తూ ఉన్నారు.