Monday, November 18, 2019
Follow Us on :

పుల్వామాలో మ‌రో ఉగ్ర‌దాడి...న‌లుగురు జ‌వాన్లు మృతి

By BhaaratToday | Published On Feb 18th, 2019

పుల్వామాలో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడి మ‌రువ‌క‌ముందే మ‌రో దాడికి పాల్ప‌డ్డారు ఉగ్రముక‌లు. ఉగ్రదాడితో ఆందోళనకరంగా మారిన దక్షిణ కశ్మీర్‌లో ఆందోళన పరిస్థితులు నెల​​​కొన్నాయి. 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని పింగ్లన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు, జైషే మహ్మద్ తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్ స‌హా ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పింగ్లాల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో జైషే మహ్మద్ కు చెందిన తీవ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేర సోమవారం ఉదయం 55 రాష్ట్రీయ రైఫిల్స్ కుచెందిన జవాన్లు దాడి చేశారు. ఉగ్ర‌వాదులు కాల్పులు ప్రారంభించడంతో జవాన్లు తిరిగి ఎదురుకాల్పులకు దిగారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్ తోపాటు ముగ్గురు జవాన్లు మరణించారు. ఈ దాడిలో మరో ఆర్మీ జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం తీవ్రవాదుల కోసం మన జవాన్లు గాలిస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయి.