Tuesday, October 15, 2019
Follow Us on :

అమ‌ర జ‌వాన్ల కుటుంబాల‌కు బీసీసీఐ రూ.5 కోట్ల విరాళం

By BhaaratToday | Published On Feb 18th, 2019

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతీపుర వద్ద గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులు బాసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ముందుకొచ్చింది. కనీసం రూ.5 కోట్లకు తగ్గకుండా విరాళం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆర్థికపరమైన అధికారాలు తమ చేతిలో లేకపోవడంతో సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ కి బీసీసీఐ తాత్కాలిక ఛీఫ్ సీకే ఖన్నా లేఖ రాశారు. ప్రభుత్వ సంస్థల ద్వారా తమ విరాళాన్ని బాధితులకు అందేలా చూస్తామని ఖన్నా తెలిపారు.

బీసీసీఐ మాత్రమే కాదు ఇతర క్రీడాకారులు కూడా సీఆర్పీఎఫ్ అమరవీరుల కుటుంబాల పట్ల జాలి చూపిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ బాధిత కుటుంబాల్లో ఉన్న పిల్లలను చదివించేందుకు ముందుకు రాగా, విదర్భ రంజీ జట్టు తాము లేటెస్ట్ గా గెలిచిన ఇరానీ ట్రోఫీ ప్రైజ్ మనీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. మరోవైపు, హర్యానా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఆఫీసర్ ర్యాంక్ లో ఉన్న స్టార్ బాక్సర్ విజేందర్ కూడా బాధితుల కోసం తన నెల జీతాన్ని విరాళంగా అందించాడు.