Wednesday, October 16, 2019
Follow Us on :

పాకిస్థాన్ ఇంత కుట్రలూ, కుతంత్రాలా.. నదిపై గేట్లను ఎత్తివేత.. ఏమైందంటే

By BhaaratToday | Published On Aug 23rd, 2019

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసాక పాకిస్థాన్ చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. భారత్ ను చిక్కుల్లో పెట్టాలని అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ వీలుపడలేదు..! భారత్ లో ఉగ్రమూకలతో దాడి చేయించాలని కూడా భావిస్తోంది.. ఆ కుటిల యత్నాలను భారత్ ధీటుగా అడ్డుకుంటోంది. ఇప్పుడు మరో కుట్రకు తెరతీసింది పాకిస్థాన్. 

 పాకిస్థాన్ ఎటువంటి హెచ్చరికలు లేకుండానే కసూర్‌లో సట్లెజ్ నదిపై ఉన్న హెడ్‌వర్క్స్ గేట్లను ఎత్తివేసింది. దీంతో పంజాబ్ సరిహద్దులోని 17 గ్రామాలు నీట మునిగాయి. అలాగే కసూర్‌లోని తోళ్ల పరిశ్రమల కాలుష్యాన్ని కూడా భారత్‌లోకి విడిచిపెట్టింది. పాక్ విడిచిపెట్టిన తోళ్ల పరిశ్రమ వ్యర్థాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ చందర్ గైండ్ చెప్పారు. 

పాకిస్థాన్ శాంతి కోరుకొంటోంది అని అంటున్న మన రాజకీయనాయకులు ఈ చర్యలకు ఏమని సమాధానం చెప్తారో చూడాలి. తరాలుమారినా పాకిస్థాన్ తీరులో మార్పు రాదని ఇటువంటి ఘటనలు చూస్తే అర్థమవుతువుంది.