Wednesday, October 16, 2019
Follow Us on :

ఆ మార్పు కోసం నా ప్రాణాలు కోల్పోయినా భయపడను: ప‌వ‌న్‌

By BhaaratToday | Published On Feb 25th, 2019

తాను ప్రజల మనిషిని అని, పార్టీల మనిషిని కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న కర్నూలులో నిర్వహించిన రోడ్ షో లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప‌వ‌న్‌ మాట్లాడుతూ, జనసేన’ ఎప్పుడూ ప్రజల వైపే ఉంటుందని స్పష్టం చేశారు. సమాజంలో మార్పు రావాలని ప్రజలకు అనిపిస్తే చాలని, ‘జనసేన’ వారికి అండగా ఉంటుందని, ఆ మార్పు కోసం తన ప్రాణాలు కోల్పోయినా భయపడనని పేర్కొన్నారు. అవినీతి కోటలను బద్దలు కొట్టి కొత్త ప్రపంచాన్ని తీసుకొద్దామని, మనం లేకుండా ఏపీ రాజకీయాలు ఉండవని పవన్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలు చాలా కీలకమని, అందరినీ సమానంగా భావించే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.