Tuesday, October 15, 2019
Follow Us on :

పాకిస్థాన్ పై ఫైర్ అయిన రాహుల్ గాంధీ.. భారత ప్రభుత్వానికి కూడా సపోర్ట్

By BhaaratToday | Published On Aug 28th, 2019

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాకిస్థాన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జమ్మూ కశ్మీర్ లో హింసను ప్రేరేపిస్తోంది పాకిస్థానేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని అన్నారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్ కే కాదు, మరే దేశానికి తావులేదని చెప్పారు.

కాశ్మీర్ లో హింస ఉందనే విషయాన్ని ఒప్పుకోవాలని.. అందుకు పాకిస్థానే కారణమని రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్ లో హింస చోటు చేసుకునేలా పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని.. పాకిస్థాన్ చర్యలు కూడా అలాగే ఉంటున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. తీవ్రవాదులకు ఒక్క కశ్మీర్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాక్ మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు . ఎన్నో విషయాలలో ప్రభుత్వంతో తాను ఏకీభవించలేనని, అయితే ఒక్క విషయాన్ని మాత్రం తాను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని అన్నారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్ కే కాదు, మరే దేశానికి తావులేదని చెప్పారు.