Wednesday, October 16, 2019
Follow Us on :

ములాయం ఇచ్చిన ఝలక్ కు స్పందించిన రాహుల్ గాంధీ..!

By BhaaratToday | Published On Feb 14th, 2019

లోక్ సభలో సోనియా గాంధీ పక్కన ఉండగానే ములాయం సింగ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని పొగిడేశారు. సోనియాను పక్కనే పెట్టుకుని మోడీ మీరు మరోసారి ప్రధాని కావాలని నేను కోరుకుంటున్నా అని ములాయం సింగ్ అన్నారు. మోడీ మీరు మరోసారి ప్రధాని కావాలని నేను కోరుకుంటున్నా. నేను మీ వద్దకు ఎప్పుడు వచ్చినా.. నా పనులను మీరు ఎప్పటికప్పుడు పరిష్కరించారని అన్నారు. మోడీ ఎన్నో మంచి పనులు చేశారని.. ఆయన వైపు ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేరని తెలిపారు. ఈ సమయంలో సోనియాగాంధీ పక్క సీటులోనే ఉన్నారు.  ములాయం వ్యాఖ్యలకు ఆమె బలవంతంగా చిరునవ్వు నవ్వారు. మోడీ నవ్వుతూ  తన రెండు చేతులను కలిపి ఊపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. 

ములాయం సింగ్ యాదవ్ ఇచ్చిన ఝలక్ కు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆచితూచి స్పందించారు. ములాయం చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని ఆయన అన్నారు. దేశ రాజకీయాల్లో ములాయం పోషించిన పాత్రను తాను గౌరవిస్తానని చెప్పారు.