Tuesday, October 15, 2019
Follow Us on :

బూట్లతో కొండెక్కిన రాహుల్ గాంధీ..! నెటిజన్ల ఫైర్..!!

By BhaaratToday | Published On Feb 22nd, 2019

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తున్నారు. తొలుత తిరుపతి చేరుకున్న ఆయన మెట్ల మార్గంలో తిరుమల చేరకొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే రహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. 110 నిమిషాల్లో 3500 మెట్లెక్కిన రాహుల్ గాంధీ.. షూ విడవలేదు. బూట్లతోనే స్వామివారి కొండెక్కారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ పాటు పక్కన ఆయన మేనల్లుడు కూడా షూతో మెట్లెక్కుతున్న ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.