Wednesday, October 16, 2019
Follow Us on :

పాక్ కు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాజ్ నాథ్ సింగ్

By BhaaratToday | Published On Aug 30th, 2019

కొద్దిరోజుల క్రితం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న చర్యలను గమనిస్తూనే ఉన్నామని.. వారిని అడ్డుకోడానికి దేనికైనా భారత్ తెగిస్తుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పరిస్థితులు దిగజారితే అణ్వాయుధాలను వాడడానికి కూడా భారత్ రెడీగా ఉందని ఆయన అన్నారు. అణ్వాయుధాలను ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతమని... అయితే జరుగుతున్న పరిస్థితులను బట్టి తమ పాలసీ మారే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితం రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.


ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లడాఖ్ లో రాజ్ నాథ్ తొలిసారి పర్యటించారు. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసర్చ్ నిర్వహించిన 26వ 'కిసాన్-జవాన్ విజ్ఞాన్ మేళా'ను ఆయన ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ మరోసారి పాక్ పై విరుచుకుపడ్డారు. భారత్ ను నాశనం చేయాలని చూస్తున్న పాకిస్థాన్ తో ఏం మాట్లాడతామని ఆయన ప్రశ్నించారు. పాక్ తో మంచి సంబంధాలనే భారత్ కోరుకుంటోందని.. పాకిస్థాన్ ఏర్పడినప్పటి నుంచి ఆ దేశ ఉనికిని భారత్ గౌరవిస్తూనే ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్థాన్ మొదట కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కశ్మీర్ భారత్ లో ఎప్పటికీ అంతర్భాగమేనని రాజ్ నాథ్ చెప్పారు. పాకిస్థాన్ ను తాను ఒకటే అడుగుతున్నానని... కశ్మీర్ వారిది ఎప్పుడయిందో చెప్పాలని కూడా అడిగారు. కశ్మీర్ పై పడి ఏడవటాన్ని ఆ దేశం ఆపేయాలని అన్నారు.