Thursday, September 19, 2019
Follow Us on :

గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది.. ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లా: రాజ్ తరుణ్

By BhaaratToday | Published On Aug 21st, 2019

ఔటర్ రింగ్ రోడ్డ్ పై యాక్సిడెంట్ అయిన కారులో ఉన్నది హీరో తరుణ్ కాదని.. యంగ్ హీరో రాజ్ తరుణ్ అని తెలుస్తోంది. మొదటి నువ్వేకావాలి ఫేమ్ తరుణ్ కు యాక్సిడెంట్ అయ్యిందని మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తరుణ్ స్పందించాడు. తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నాడు. తాను రాత్రంతా ఇంట్లోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని తరుణ్  చెప్పాడు. మీడియాలో వచ్చిన వార్తలను చూసి, తన క్షేమసమాచార నిమిత్తం వందల మంది ఫోన్ చేస్తున్నారని..  తాను క్షేమంగా ఉన్నానని, ప్రమాదం జరిగిన కారు తనది కాదని తరుణ్ అన్నాడు.

దీంతో ప్రమాదం జరిగింది రాజ్ తరుణ్ కే నని తెలుస్తోంది.  ప్రమాదం తరువాత మరో కారులో వెళ్లిపోగా కొందరు అతని పేరును తరుణ్ గా పేర్కొనడంతోనే, మీడియా సైతం పొరపాటు పడింది.  దీనిపై తరుణ్ వివరణ ఇవ్వడంతో.. కారులో ఉన్నది రాజ్ తరుణ్ అని తెలుస్తోంది.  యాక్సిడెంట్ తరువాత రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్లాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. రాజ్ తరుణ్‌ తన వాల్వో కారు (టీఎస్ 09 ఈఎక్స్ 1100)లో హైదరాబాద్ కు వస్తున్న వేళ, అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. 
రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడా అని అందరూ టెన్షన్ పడుతున్న సమయంలో ట్విట్టర్ లో తనకు జరిగిన ప్రమాదం గురించి పోస్టు పెట్టాడు. 


యాక్సిడెంట్ విషయం తెలుసుకున్నాక తనకేమైందోనని  చాలామంది కాల్స్ చేస్తున్నారనీ, ఇంత మంది ప్రేమను పొందినందుకు తాను అదృష్టవంతుడినని అన్నాడు. అలాగే నార్సింగి సర్కిల్ లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయని రాజ్ తరుణ్ గుర్తు చేశాడు. కారు ప్రమాదం అనంతరం తాను అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నానని చెప్పాడు. నార్సింగి సర్కిల్ లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చిందని.. అక్కడే నేను కారుపై నియంత్రణ కోల్పోయానన్నాడు. కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్దానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డానన్నాడు. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని  రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు.

Image