Monday, September 23, 2019
Follow Us on :

వారం రోజులు టైమ్ ఇచ్చిన రాజా సింగ్.. తీసేయాల్సిందే..!

By BhaaratToday | Published On Sep 7th, 2019

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రకారంలోని మండప స్తంభాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖచిత్రం ఉండడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆలయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్థానిక బీజేపీ నేతలతో​ కలిసి శనివారం పరిశీలించారు. దర్శనం పూర్తయ్యాక కేసీఆర్‌ చిత్రాలపై అక్కడి వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆలయ స్తంభాలపై కేసీఆర్‌, కారు చిత్రాలను చెక్కడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ స్తంభానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్‌ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్‌ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను ఉంచారు.  

ఆయన ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి స్తంభాలపై చెక్కిన కేసీఆర్, కారు బొమ్మలను తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజులు టైం ఇస్తున్నామని అన్నారు. వారంలోపు తొలగించకపోతే దేశంలో ఉన్న హిందూవాదులందరితో కలిసి ఆందోళనకు దిగుతామని వార్నింగ్‌ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ఆయన బొమ్మలను వేయడం సరికాదన్నారు.