Monday, September 23, 2019
Follow Us on :

యాదాద్రిలో రాజా సింగ్..!

By BhaaratToday | Published On Sep 7th, 2019

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రకారంలోని మండప స్తంభాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖచిత్రం ఉండడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆలయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్థానిక బీజేపీ నేతలతో​ కలిసి శనివారం పరిశీలించారు. దర్శనం పూర్తయ్యాక కేసీఆర్‌ చిత్రాలపై అక్కడి వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆలయ స్తంభాలపై కేసీఆర్‌, కారు చిత్రాలను చెక్కడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై ఇప్పటికే రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు ఆయన ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ వేశారు. ఆయన మాట్లాడుతూ అసలు అలాంటి పనులు చేయడానికి కారణం ఏమిటి.. యాదాద్రి ఆలయ గోడలు, స్తంభాలపై కేసీఆర్ బొమ్మ, కారు బొమ్మ, ఆయన తీసుకొచ్చిన పథకాలను చెక్కడం కేసీఆర్ కు తెలిసే జరుగుతోందా అని ప్రశ్నించారు. దీనికి బాధ్యులు ఎవరో తెలుసుకొని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ స్తంభాలను వెంటనే తీసేయాలనీ.. తొలగించకుంటే తెలంగాణ ప్రజలతో కలిసి తామే తొలగిస్తామని రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. యాదాద్రి ఆలయం ఏ ఒక్కరిదీ, ఏ పార్టీదీ కాదని.. దాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నది ప్రభుత్వ బాధ్యత అనీ, ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు, పార్టీ జేబుల నుంచి డబ్బులు పెట్టడం లేదని, ప్రజల సొమ్ము అని రాజాసింగ్ ఫైర్ అయ్యారు.   

ఆలయ స్తంభానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్‌ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్‌ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను ఉంచారు.