Monday, August 19, 2019
Follow Us on :

ఆ ఇద్దరు యువతులు రాజమండ్రి నుండి ఉద్యోగానికి చెన్నైకి వెళ్లారు..!

By BhaaratToday | Published On Jul 16th, 2019

చెన్నైలో ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళుతున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయింది. వెనకాలే వస్తున్న ఎంటీసీ బస్సు వారి మీద నుండి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. బైక్ నడుపుతున్న వ్యక్తి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. 20 ఏళ్ల శివ అనే వ్యక్తి ఆ బైక్ ను నడుపుతూ ఉండగా.. భవాని, నాగ లక్ష్మి వెనుక కూర్చున్నారు. 

చెన్నై నగరం లోని నందనం హైవే మీద శివ హెల్మెట్ పెట్టుకుని వాహనాన్ని నడుపుతూ వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో బైక్ అదుపు తప్పడం.. పక్కనే వస్తున్న బస్సు వారి మీద నుండి వెళ్ళిపోయింది.  భవాని, నాగ లక్ష్మిలు అక్కడికక్కడే మరణించారు. శివ పరిస్థితి విషమంగా ఉంది. వీరు ముగ్గురూ ఎగ్మోర్ లో పనిచేస్తూ ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో ప్రమాదం దృశ్యాలు రికార్డు అయ్యాయి. శివ తన బైక్ తో బస్సును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పక్కనే వస్తున్న మరో బైకర్ ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. శివ నడుపుతున్న బైక్ ఏపీ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది.    

వీరంతా రాజమండ్రికి చెందిన వాళ్ళు. రాజమహేంద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ నుంచి ఇటీవలే బీటెక్ (ఈఈఈ) పూర్తి చేశారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన వీరికి 25 రోజుల కిందట.. చెన్నైలో ఉద్యోగావకాశం రావడంతో డికి వెళ్లారు. అక్కడి ఓ సంస్థలో ఉద్యోగంలో చేరారు. రోజూ మాదిరిగానే మంగళవారం (జులై 16) ఉదయం జాబ్ కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ యువతులు ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా.. శివ రాయపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.