Thursday, September 19, 2019
Follow Us on :

భార‌త్ టుడే ఓ చ‌క్క‌టి వేదిక..అదే ‘రాజ‌కీయ రంగ‌స్థ‌లం’

By BhaaratToday | Published On Mar 15th, 2019

- నేడు తిరుప‌తిలో
రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహించేవి ఎన్నికలు. ఆ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ..ఎటే టైం ఎన్నికలు. ఏపీలో ఎన్నికల పండుగ శోభ వెల్లివిరుస్తోంది. పార్టీల నడుమ రాజకీయ సమరం తారాస్థాయికి చేరింది. మిడ్ సమ్మర్ లో హాట్ హాట్ గా జరిగే ఎన్నికల్లో..ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో..అంతా సస్పెన్స్. ఈ సందర్భంలో అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు తమ మనోభిష్టాన్ని వెల్లడించడానికి భారత్ టుడే ఓ చక్కని వేదిక ఏర్పాటు చేసింది. అదే రాజకీయ రంగస్థలం.

విద్యార్థులకు ఏటేటా ఎండాకాలంలో పరీక్షలు వస్తే, రాజకీయ నాయకులకు అయిదేళ్ల కోసారి ఎన్నికల పరీక్షలు వస్తూంటాయి. అయితే, విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఉండే ఫలితం, రాజకీయ నేతలు, కష్టించి పనిచేసి ప్రజాసేవలో తరిస్తే ప్రయోజనం కన్పిస్తుంది. ఇది సాధారణ సూత్రం.  అయితే, పాలిటెక్స్ లో మాత్రం ఇది అంత ఈజీ విషయం కాదు. ఇప్పుడు రాజకీయ నేతల పరీక్షలు వచ్చాయి. ఈ పరీక్షల్లోని రాజకీయ విద్యార్థులకు,  ఓటర్ అధ్యాపకులు ఎన్ని మార్కులు వేస్తారో, ఎంతమందిని గట్టెక్కిస్తారో, ఎందరిని తిరస్కరిస్తారో అంతా భవితలోనే నిర్ణయం అవుతుంది.
 ఈ నేపథ్యంలో, అన్నిపక్షాల రాజకీయ నాయకులు, అన్నివర్గాల ప్రజలు...అందరి అభిప్రాయాలు...ఎన్నికల వేళ తెలియజేయడానికి భారత్ టుడే ఓ మా మంచి గొప్ప కార్యక్రమానికి భారత్ టుడే శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అద్బుత రీతిలో నిర్వహించడానికి ఉద్దేశించిన ఆ కార్యక్రమమే రాజకీయ రంగస్థలం. ఇప్పటికే కర్నూలు, అనంతపురం, కడపలో ఈ రంగస్థల పండుగకు ప్రజలు నీరాజనాలు పట్టారు.
గత ప్రభుత్వంలో ప్రజలు ఏ ప్రయోజనాలు పొందారు, రాబోయే ప్రభుత్వంలో తామేం కోరుకుంటున్నారు....ఏ రీతిన అభివృద్ది కాంక్షిస్తున్నారు అని నిర్భయంగా తెలియజేయడానికి ఈ వేదిక ఏర్పాటు చేసింది. అదేవిధంగా రాజకీయ నేతలు తాము ప్రజలకు ఇంతవరకు అందించిన సేవలు, ఎన్నికల అనంతరం అందించే సేవలు తెలియజేయడానికి నిర్వహిస్తున్న రాజకీయ రంగస్థలం..శుక్ర‌వారం (నేడు) చిత్తూరు జిల్లా తిరుప‌తి సీమలో రంగరంగ వైభవంగా రంగస్థలాన్ని నిర్వహించడానికి సమాయత్తం అయ్యింది. 

ఆప్త మిత్రులుగా ఉండే నేతలు, ఒక్క రోజులో బద్ధ శత్రువులుగా మారిపోతారు. గురు, శిష్యులుగా ఉన్నవారు వైరి వర్గంగా మారిపోతారు. నువ్వా, నేనా అనే రీతిలో రాజకీయ కొదమ సింహాల్లా విజృంభిస్తారు. వాక్బాణాలతో పోరాటం సాగిస్తారు. పార్టీలు ఏదైనా చాపకింద నీరులా వెన్నుపోటు రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు. ఎందరో గొప్పగొప్ప నేతలకు పుట్టినిల్లయిన తిరుప‌తిలో రాజకీయ రంగస్థలం ఈ సాయంత్రం ఆరున్న‌ర గంట‌ల‌కు రసవత్తరంగా సాగనుంది.