Tuesday, May 21, 2019
Follow Us on :

ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్న రాజమౌళి.. ఎప్పటిదాకా ఆగాలంటే

By BhaaratToday | Published On Mar 12th, 2019

రాజమౌళి.. బాహుబలి తర్వాత ప్రపంచం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూసింది. హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ వచ్చిన రాజమౌళి బాహుబలి 1,2లతో తన విజన్ ఎలా ఉందో చూపించగలిగాడు. ఇప్పుడు ఆ సినిమా తర్వాత మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికైతే పేరు బయటపెట్టలేదు కానీ.. 'ఆర్ఆర్ఆర్' పేరుతో ప్రజల్లో నానుతోంది. హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లను తీసుకోవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు రాజమౌళి చెప్పబోతున్నాడట.. అది కూడా అతి త్వరలో..! 

రెండు షెడ్యూల్స్ పూర్తయిన 'ఆర్ఆర్ఆర్' గురించి 14వ తేదీన రాజమౌళి మీడియా సమావేశం నిర్వహిస్తారని టాలీవుడ్ లో చెప్పుకుంటూ ఉన్నారు. ఈ మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన విషయాలు చెబుతారని అందరూ భావిస్తున్నారు. తప్పకుండా రాజమౌళి సినిమా గురించే మాట్లాడుతారా అని తెలుగు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ అని, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని, బాక్సింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని, రెండు జన్మల కథని, బాలీవుడ్ స్టార్లు ఓకే చెప్పేశారని ఇలా ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానం రాజమౌళి గారే చెప్పాలి.