Friday, March 22, 2019
Follow Us on :

రాజమౌళిని మెప్పించిన 'డైసీ ఎడ్గార్ జోన్స్' ఎవరు..?

By BhaaratToday | Published On Mar 14th, 2019

రాజమౌళి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది అంటే.. ఆ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అయితే వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళతారు. అందుకే గతంలో పలు చిత్ర పరిశ్రమలకు చెందిన నటీ నటులను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. కన్నడ, తమిళం, మలయాళం.. ఇలా వివిధ ఇండస్ట్రీలకు చెందిన వాళ్ళను తన సినిమాల ద్వారా నటింపజేశాడు. ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రెస్ మీట్ లో ఆయన ఎన్టీఆర్ కు జోడీగా ఒక యాక్ట్రెస్ పేరును చెప్పుకొచ్చారు. ఆమె పేరు 'డైసీ ఎడ్గార్ జోన్స్'..! ఆమె గురించి చెప్పగానే మనవాళ్ళు ఆమె గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే..? 

డైసీ ఎడ్గార్ జోన్స్ ఓ బ్రిటీష్ నటి. సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్ వంటి టీవీ సిరీస్ లలో నటించింది. పాండ్ లైఫ్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించింది. అలాగే డైసీ పలు డ్రామాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  బ్రిటన్ లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందిన ఈ యువనటి ద మౌంట్ స్కూల్ ఫర్ గాళ్స్ లో విద్యాభ్యాసం చేసింది. ఆ తర్వాత వుడ్ హౌస్ థియేటర్ స్టడీస్ సెంటర్ (వుడ్ హౌస్ డ్రామా కాలేజ్) లో చేరి నటనకు సంబంధించిన కోర్సులు అభ్యసించింది. 

ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించబోతున్నారు.