Thursday, December 12, 2019
Follow Us on :

వైఎస్ రాజ‌శేఖర్‌రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్‌...ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం: చ‌ంద్ర‌బాబు

By BhaaratToday | Published On Jul 18th, 2019

మాజీ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్ అని...మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష‌నేత‌ చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఆయనతో రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం లేదని అన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విగ్రహాల తొలగింపుపై జరిగిన చర్చలో భాగంగా చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలంటే చంద్రబాబుకు కడుపు మంట అని.. విజయవాడలో ఎవరికీ అడ్డం లేని చోట రాజవేఖర్‌రెడ్డి విగ్రహం ఉందన్నారు. రోజూ చంద్రబాబు వెళుతుంటే ఆ విగ్రహాన్ని చూసి ఓర్వలేక దానిని తొలగించిన మహానుభావుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన‌ చంద్రబాబు ‘‘రాజశేఖర్ రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్. 1975 నుంచి 1983 వరకు కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర్ రెడ్డి, నేను ఒకే రూమ్‌లో ఉండే వాళ్ళం. జగన్‌కు మా స్నేహం తెలియక పోవచ్చు. వైఎస్సార్‌తో రాజకీయ విభేదం తప్ప... వ్యక్తిగత వైరం లేదు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.