Monday, November 18, 2019
Follow Us on :

సార్వత్రిక ఎన్నికలపై రజనీకాంత్ కీలక ప్రకటన!

By BhaaratToday | Published On Feb 17th, 2019

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై న‌టుడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని స్ప‌ష్టం చేశారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. 2021లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, మరో పార్టీకి మద్దతిచ్చేందుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరికైనా తన మద్దతు ఉందంటూ ప్రచార చేసుకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రచారంలో తన చిత్రాన్ని వాడరాదని, రాష్ట్రంలో నీటి సమస్యను పరిష్కరిస్తారని భావించిన వారికి ప్రజలు ఓటు వేయాలని సూచించారు.