Tuesday, October 15, 2019
Follow Us on :

రోబో 2.0కు అరుదైన గౌర‌వం...గోల్డెన్ రీల్ అవార్డుకు ఎంపిక‌

By BhaaratToday | Published On Jan 20th, 2019

సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో  శంకర్ రోబో 2.0 చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా రోబో 2.0 సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. రోబో 2.ఓ గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్ అయినట్లు సినిమా సౌండ్ ఇంజనీర్ గా రసూల్ తెలిపారు. ‘బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌’ విభాగంలో రోబోకు ఈ గుర్తింపు దక్కిందన్నారు. ప్రఖ్యాత మోషన్ పిక్చర్‌ సౌండ్‌ ఎడిటర్స్‌(ఎంపీఎస్‌ఈ)  ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. ఫిబ్ర‌వ‌రి 17న లాస్‌ ఏంజిల్స్‌లో  ఈ వేదిక జ‌రుగ‌నుంది. 2.0 తో పాటు మరెన్నో అంతర్జాతీయ చిత్రాలు వేర్వేరు విభాగాల్లో అవార్డులకు ఎంపికయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సౌండ్‌ ఎడిటింగ్‌ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. 3డీ ఫార్మెట్‌లో 4డీ ఎస్‌ఎల్‌ఆర్‌ సౌండ్‌సిస్టంలో ఈ సినిమాను శంకర్ తెరకెక్కించారు.