Saturday, December 14, 2019
Follow Us on :

భారత్-విండీస్ టెస్టు మ్యాచ్‌లపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సంచలన వ్యాఖ్యలు

By BhaaratToday | Published On Sep 2nd, 2019

భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే..! టెస్ట్ మ్యాచ్ లు అయితే రాత్రి మొదలై తెల్లవారుజామున ముగుస్తున్నాయి. భారత్ లో ఈ టైమ్ లో మ్యాచ్ చూడడం చాలా కష్టమే.. అప్పటికీ నిద్ర మానుకొని ఒకటి, రెండు సెషన్స్ చూస్తూ ఉన్నారు. అయితే కనీసం మ్యాచ్ జరుగుతున్న కరీబియన్ దీవుల్లో కూడా పెద్దగా మ్యాచ్ లను చూడడానికి ఇష్టపడడం లేదు. స్టాండ్స్ దాదాపుగా ఖాళీనే..! దీనిపై  ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.  

కరీబియన్ దీవుల్లో జరుగుతున్న భారత్-విండీస్ టెస్టు మ్యాచ్‌లను స్టేడియంలో 50 మంది కూడా చూడడం లేదని, చూస్తుంటే కరీబియన్ దీవుల్లో క్రికెట్ చివరి దశకు చేరుకున్నట్టు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీసీ ఏమైనా చేయాలని, వెస్టిండీస్‌లో క్రికెట్ పూర్వవైభవానికి కృషి చేయాలని రాజీవ్ శుక్లా కోరారు. విండీస్‌ లో భారతీయులు ఎక్కువగా ఉన్నారని వారు కూడా రావడం లేదని బాధపడ్డారు.